ఎరక్కపోయి కొట్టాడు.. ఇరుకున పడ్డాడు.. SpiceJet cancels Ravindra Gaikwad's ticket

Spicejet thwarts shiv sena mp ravindra gaikwad s attempt to book air ticket

Ravindra Gaikwad, Shiv Sena, Air India, spicejet, Indigo, private airlines, shiv sena, Blacklist, Flight ticket, parliament member

After Air India ahttp://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#nd Indigo, it was SpiceJet’s turn to thwart reviled Shiv Sena MP Ravindra Gaikwad’s attempts at air travel on Saturday

ఎరక్కపోయి కొట్టాడు.. ఎగరలేక ఇరుకున పడ్డాడు..

Posted: 04/01/2017 06:39 PM IST
Spicejet thwarts shiv sena mp ravindra gaikwad s attempt to book air ticket

ఎయిరిండియా సీనియర్ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు వరుసగా పరాభవాలు ఎదురవుతూనే వున్నాయి. ఈయన వల్ల మహారష్ట్రకు చెందిన బీజేపి ఎంపీకి కూడా గైక్వాడ్ అనే పేరుతో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. తన కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా అవును పాతికసార్లు చెప్పుతో కొట్టాను, పోలీసు కేసు పెడతారా..? నాపై ఇప్పటికే అనేక కేసులు నమోదైవున్నాయి.. ఇది మరోకటి అవుతుంది అంటూ అహంకారపూరితంగా ఘటనపై స్పందిచిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. ఇప్పుడు మాత్రం ఎరక్క పోయి కొట్టాను.. ఇరుకున పడ్డాను అని భావిస్తున్నారు.

ఎయిరిండియాతో పాటు ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ఆయన విమానయానం చేయడంపై నిషేధం విధంచాయి దీంతో ఆయనకు ఇవాళ మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఐదుసార్లు విమానం ఎక్కేందుకు ప్రయత్నించి భంగపడిన గైక్వాడ్‌ తాజాగా ప్రైవేటు విమానంలోనూ తిరస్కారానికి గురయ్యారు. ఈసారి ఆయన స్పైస్ జెట్ లో బుక్ చేసుకునుందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. చౌక ధరకు అందుబాటులో ఉండే  స్పైస్ జెట్ లో సోమవారం పుణె నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకోవాలనుకున్నారు. రూ. 4,504 ధర కలిగిన టికెట్‌ను కొనేందుకు ఆయన ప్రయత్నించారు.

కాగా.. ప్రయాణికుడి పేరును 'రవీంద్ర గైక్వాడ్‌' అని చెప్పడంతోనే స్పైస్‌జెట్ వెంటనే టికెట్‌ బుకింగ్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని స్పైస్‌జెట్‌ ప్రతినిధి తెలిపారు. తన విమానంలో 60 ఏళ్ల మేనేజర్‌పై దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన గైక్వాడ్‌కు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియా ఇప్పటికే పలుమార్లు షాక్‌ ఇచ్చింది. ఎంపీ గైక్వాడ్‌ ఐదుసార్లు ఎయిరిండియా టికెట్‌ బుక్‌ చేసేందుకు ప్రయత్నించగా.. అన్నిసార్లు నిరాకరించింది. విమానంలో ప్రయాణించేందుకు అనుమతించకపోవడంతో ఆయన ఇప్పటికే రైలులో, కారులో ప్రయాణాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles